ఆగస్టులో అదృష్టం ప్రకాశిస్తోంది.. ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టారు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు నెల చాలా కీలకమైనది. ఈ నెలలోనే కొన్ని పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి.సూర్యుడు, శుక్రుడు, అంగారకుడి సంచారంలో పెను మార్పు రాబోతుంది. ఈ ప్రభావం అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలను తీసుకురాబోతోంది. ఏయే రాశులవారికి మేలు జరగబోతోందో తెలుసుకుందాం.
సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. డబ్బు, కీర్తి, ఆనందానికి కారకుడైన శుక్రుడు, మేథా శక్తికి ప్రతీక అయిన బుధుడు, అంగారకుడు తమ రాశులను మారుస్తున్నాడు. వాస్తవానికి 45 రోజులకోసారి కుజుడు తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న అంగారకుడు ఈనెల 17వ తేదీ వరకు అక్కడే ఉండి తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల గమనంవల్ల ప్రధానంగా ఐదు రాశులవారు లాభపడనున్నారు.

వృషభ రాశి: ఈ రాశివారికి ఇది మంచి సమయం. ప్రతి పని విజయవంతమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు ఆస్తికి సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమవుతాయి.
కన్యా రాశి: చేపట్టే ప్రతి పనిలోను అదృష్టం కలిసివస్తుంది. కోరికలన్నీ నెరవేరడంతోపాటు ఆర్థికంగా బలోపేతమవుతారు. అనారోగ్యం తగ్గుతుంది. భూమికానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది.
తులా రాశి: గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కెరీర్ బాగుంటుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి లాభాలనిస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాల నుంచి కూడా ప్రయోజనాలను పొందుతారు.
మేష రాశి: పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. రచన లేదంటే జర్నలిజం లేదంటే విద్యారంగంలో ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. విదేశాల్లో ఉద్యోగం వస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గతం నుంచి పెండింగ్ లో ఉన్న పనులన్నీ ప్రస్తుతం పూర్తవుతాయి.
మిథున రాశి: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారికి బాగుంది. కొత్త ఉద్యోగం పొందుతారు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. చేపట్టే ప్రతి పనిలోను అదృష్టం తోడుంటుంది. వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణం చేస్తారు.












Click it and Unblock the Notifications