వినాయక చవితి ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. !

వినాయక చవితి ఈ సంవత్సరం 18వ తేదీ జరుపుకోవాలా? 19వ తేదీ జరుపుకోవాలా? అంటూ సందేహం అందరినీ వెంటాడుతోంది. కాణిపాకం దేవస్థానం కూడా 18వ తేదీనే వినాయక చవితి పర్వదినాన్ని నిర్వహిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో 18వ తేదీన పండగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది వినాయక చవితి పర్వదినం ఆరు రాశులవారికి శుభప్రదం కానుంది. స్వామి అనుగ్రహాన్ని పొందనున్నారు. అంతేకాదు.. సంపదతో వారి ఇల్లు నండివుంటుంది. జీవితంలో ప్రధాన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మేష, సింహ, మకర రాశులతోపాటు 6 రాశుల వారికి ఈ ఏడాది గణేష్ చతుర్థి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది.

మేష రాశి : గణేష్ చతుర్థి రోజున ఈ రాశి వారికి వ్యాపారాల్లో లాభం ఉంటుంది. పనిలో లాభంతోపాటు ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రోజు ఆదాయం బాగుంటుంది. ధన ప్రవాహం బాగుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

These zodiac sign people are very lucky due to ganesh chaturthi 2023

సింహ రాశి : గణేష్ చతుర్థి రోజున శత్రువుల కుట్ర ఫెయిలవుతుంది. పనిలో ఆటంకాలు తొలగిపోయి సజావుగా సాగుతుంది. డబ్బుకు ఉన్న కొరత తీరిపోతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

కన్య రాశి: సంపద పెరగడంతోపాటు ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఇతరులపై మీ ప్రభావం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.

తుల రాశి: గణేష్ చతుర్థి రోజు మనోబలం దృఢంగా ఉంటుంది . ఆత్మవిశ్వాసం బలంగా ఉంది. కొత్తగా ఏది చేసినా మనసుకు సంతృప్తినిస్తుంది.

ధనుస్సు: ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. అనేక రంగాల్లో లాభపడతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలున్నాయి.

మకర రాశి: వ్యాపారానికి సంబంధించినవారు గణపతి అనుగ్రహాన్ని సాధిస్తారు. సంపద, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు యాజమాన్యం నుంచి మద్దతు లభిస్తుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రమోషన్ పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+