700 సంవత్సరాల తర్వాత 5 ప్రత్యేక యోగాలు
సుమారు 700 సంవత్సరాల తర్వాత గురుడు, శుక్రుడు ముఖాముఖిగా కలుసుకోబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనివల్ల అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. శషయోగం, కేంద్ర త్రికోణ యోగం, మాళవ్య యోగం, నవపంచమ యోగం, రుచక మహాయోగాలు ఏర్పడబోతున్నాయి. మేష రాశితో పాటు మకర రాశివారిపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ 5 యోగాల కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
మేషరాశి: ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. శుక్రుడి అనుగ్రహంతో ప్రేమ సంబందాలు బలోపేతమవుతాయి.

కన్యారాశి: వీరికి అదృష్టం వరిస్తుంది. దీనివల్ల చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు.
ధనుస్సు రాశి: వీరి అదృష్టం రెట్టింపవుతుంది. సంతోషం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారు విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడి లాభాలు పొందుతారు. సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది.
మకర రాశి: కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభిస్తాయి. ఆకస్మిక ధనలాభాలున్నాయి. ఆర్థికంగా బలపడతారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో పూర్తి విజయాన్ని దక్కించుకుంటారు.












Click it and Unblock the Notifications