మేషరాశిలో గురుడు... ఈ రాశులవారు పట్టుకుందల్లా ప్లాటినమే
బృహస్పతి శ్రేయస్సు, జ్ఞానం, ఆధ్యాత్మికత, జ్యోతిష్యం, గౌరవం , ప్రతిష్టకు కారకుడిగా జ్యోతిష్య శాస్త్రం పరిగణిస్తుంది. గురు గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ రాశులపై ప్రభావం పడుతుంది. సుమారు 12 సంవత్సరాల తర్వాత గురువు మేషరాశిలో సంచరిస్తోంది. దీని ప్రభావం కొన్ని రాశిచక్ర గుర్తులపై ఉన్నప్పటికీ ప్రధానంగా మేష రాశి, ధనస్సు రాశి, సింహరాశి జాతకులకు బాగా కలిసిరానుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి : వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. ఉద్యోగంలో మార్పులుంటాయి. సీనియర్ నుంచి లేదంటే అందుకు కారణమైనవారి సహాయాన్ని తీసుకుంటారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. బృహస్పతి మేష రాశి నుంచి 9, 12 ఇళ్లకు అధిపతి. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళితే మంచి జరుగుతుంది.

ధనస్సురాశి : బృహస్పతి ప్రత్యక్ష కదలిక వీరికి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. పనులను ప్రణాళిక ప్రకారం సకాలంలో పూర్తిచేస్తారు. మధ్యలో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. తల్లిదండ్రుల ధనం నుంచి ప్రయోజనం ఉంది. ప్రేమ సంబంధాలను ఎక్కువగా కలిగివుంటారు. ఈ సమయంలో వీరు విజయం సాధిస్తారు.
సింహరాశి : బృహస్పతి ప్రత్యక్ష చలనం వీరికి ఎంతో లాభకరంగా ఉంటుంది. అదృష్టం తోడుండటంవల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. మతపరమైన లేదంటే ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కోరికలు సులువుగా నెరవేరతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కోరికలన్నీ నెరవేరతాయి.












Click it and Unblock the Notifications