కొత్త సంవత్సరంలో మే 1 వరకు వీరిపై ధన వర్షం
జ్యోతిష్యం ప్రకారం బృహస్పతిని దేవ గురువుగా పరిగణిస్తారు. అంతేకాదు.. గ్రహాలన్నింటిలోకెల్లా బృహస్పతి అతి పెద్ద గ్రహం. గతేడాది మేషరాశిలోకి ప్రవేశించిన గురుడు మే ఒకటో తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనితర్వాత వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. సాధారణంగా బృహస్పతి కెరీర్, ఆనందం, వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. రానున్న నాలుగు నెలల్లో ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
మేషరాశి : గురుడు సంచరించడం కూడా ఇదే రాశిలో జరుగుతోంది. రాబోయే నాలుగు నెలలపాటు వీరి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది. కెరీర్ లో వృద్ధి ఉంటుంది.సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం లభిస్తుంది. డబ్బును పొదుపు చేయాలి. జీవితంలో సంతోషంగా ఉంటారు.

సింహరాశి : అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థికలంగా బలోపేతమవుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి వస్తుంది. ఆధ్యాత్మిక పరమైన, మతపరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ ఉంటుంది.
కర్కాటకరాశి : కెరీర్ లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. విదేశాలకు వెళ్లేవారి కోరిక నెరవేరుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.












Click it and Unblock the Notifications