కర్కాటక సంక్రాంతితో ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే
జ్యోతిష్యంలో సూర్యుడి రాశి మార్పును సంక్రాంతి అంటారు. ప్రతి నెలా భానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏడాది కాలంలో భాస్కరుడు 12 రాశుల్లో సంచరిస్తాడు. ఈనెల 16వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీన్నే కర్కాటక సంక్రాంతి అంటారు లేదా కర్క సంక్రాంతి అంటారు. దీనివల్ల ఏయే రాశులవారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
తులారాశి
రవి కర్కాటకరాశిలోకి ప్రవేశించడమనేది వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు.

కన్యారాశి
కర్కాటకంలో ఆదిత్యుడి సంచారం కన్యారాశివారి ఆర్థిక సమస్యలను తీరుస్తుంది. వ్యాపారస్తులకు గతంలోకంటే ఎక్కువ లాభాలు కలుగతాయి. ఉద్యోగస్తులు మంచి ఫలితాలను పొందుతారు. గతంలో పెట్టుబడి పెట్టివున్నవాటిపై ఇప్పుడు లాభం వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరుకుతుంది.
మేష రాశి
మేష రాశివారికి అదృష్టం తోడుంటుంది. ఉద్యోగస్తులు తమ విధినిర్వహణలో మంచి పురోగతిని కనపరుస్తారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. వాహనాన్ని లేదంటే భూమిని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. అదృష్టం కలిసిరావడంవల్ల ప్రతి పనిని విజయవంతంగా చేస్తారు.
మిథునరాశి
ఈ రాశివారికి ఎంతో ప్రయోజనం ఉంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి లభిస్తుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అన్నివిధాలుగా మెరుగుపడుతుంది. ఊహించని ధనలాభం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటకంలో భాస్కరుడి సంచారం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. ఉద్యోగం, వ్యాపారం.. రెండింటిలోను అభివృద్ధి చెందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.












Click it and Unblock the Notifications