వృశ్చిక రాశిలో కుజుడివల్ల ఈ రాశులవారిపై కనక వర్షం
వృశ్చిక రాశిలో కుజుడు ఒంటరిగా ప్రయాణం ప్రారంభించాడు. దీనివల్ల ఆరు రాశులవారికి శుభ ఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు వృశ్చికంలో కుజుడితో కలిసి ఉన్న రవి ధనూరాశిలోకి వెళ్లడంతో కుజుడు ఒక్కడే మిగులుతాడు. ఏయే రాశులవారికి దీనివల్ల కలిసి రాబోతోందో తెలుసుకుందాం.
మేష రాశి
వీరికి ఊహించనిరీతిలో ధనయోగం పడుతుంది. అప్రయత్న ధనప్రాప్తికి అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారాలు, జూదాలు, లాటరీలు, రియల్ ఎస్టేట్, షేర్లు.. తదితరాల్లో అంచనాలకు మించిన ఆదాయం ఉంటుంది. వ్యవసాయంతోపాటు భూమికి సంబంధించిన వ్యాపారాల్లో బాగా కలిసివచ్చి సంపద పెరుగుతుంది.

తుల రాశి
అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి జీతభత్యాలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి
ధనాదాయం పెరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసివస్తాయి. అన్ని విభాగాల్లో సంపాదన వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. పొలాలు, స్థలాల విలువ అంచనాలకు మించి పెరుగుతాయి.
ధనుస్సు రాశి
వీరికి మహా భాగ్య యోగం ఉంది. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. షేర్లు, జూదాలు, లాటరీలు, పందాలు లాంటివి కలిసివస్తాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. స్థిరాస్తులద్వారా సంపద పెరుగుతుంది.
కుంభ రాశి
ఉద్యోగంలో పదోన్నతి ఉంది. అనుకోకుండా ఆస్తి కలిసివస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. అలాగే చేతికి డబ్బులు కూడా అందుతాయి. ఆస్తికి సంబంధించిన వివాదం పరిష్కారమవుతుంది.
మీన రాశి
వృత్తి, ఉద్యోగాల్లో ధనయోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. స్థిరాస్తులవల్ల సంపద పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలద్వారా సంపద పెరుగుతుంది.












Click it and Unblock the Notifications