అక్టోబరు 1 నుంచి వీరే కింగ్ ఆఫ్ ది కింగ్స్!
అక్టోబరు నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. 1వ తేదీ రాత్రి 8.45 గంటలకు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి ఆ రాశిలో సూర్యుడు ఉంటాడు. బుధ, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. జ్యోతిష్యం ప్రకారం బుధాదిత్య రాజయోగం మంచిది. ఏ రాశిలో ఏర్పడితే ఆ రాశి జాతకానికి తిరుగుండదు. ఊహించని ధనలాభంతోపాటు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ యోగంవల్ల లాభం పొందనున్న రాశుల వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. రచన, జర్నలిజం, విద్యరంగాలకు చెందిన వ్యక్తులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. పనిచేసేచోట ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. విదేశాల్లో ఉద్యోగం రావడంతోపాటు సంతానం లేనివారికి పిల్లలు కలుగుతారు. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు.

సింహ రాశి
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి శుభవార్తలు అందుతాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం తొలిగిపోతుంది. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ప్రతి పనిలో అదృష్టం తోడుంటుంది. వ్యాపారం కోసం దూర ప్రయాణం చేస్తారు.
వృషభ రాశి
కోరికలన్నీ నెరవేరతాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు సహకారం అందుతుంది.
కన్యా రాశి
వ్యాపారం వృద్ధి చెందుతుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. పిల్లలు కలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.
ధనస్సు రాశి
వ్యాపారులకు అనువైన సమయం. ఉద్యోగస్తులకు కూడా ధనలాభాలుంటాయి. ప్రమోషన్లతోపాటు ఇంక్రిమెంట్లు అందుతాయి. కోరుకున్న చోటకి బదిలీ అవుతారు. భాగస్వామ్యం మీద చేస్తున్న వ్యాపారంలో లాభాలు అందుకుంటున్నారు.












Click it and Unblock the Notifications