రాశిని మారుస్తున్న 5 గ్రహాలు... వీరిపై కనక వర్షం
డిసెంబర్ 2023 నెల కొందరికి ప్రత్యేకమైనది. ఏకంగా ఐదు గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. కొన్ని గ్రహాలు సంచారం ద్వారా తమ రాశిని మారిస్తే
మరికొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటాయి. ఈ మార్పులు 12 రాశులవారిపై ప్రభావం చూపుతాయి. డిసెంబరు నెలలో ఏయే గ్రహాలు సంచారం చేస్తున్నాయో, ఏయే రాశులవారికి అనుకూలంగా ఉన్నాయో తెలుసుకుందాం.
బుధుడి తిరోగమనం:గ్రహాల యువరాజు బుధుడు డిసెంబర్ 13 మధ్యాహ్నం 12.38 గంటలకు తిరోగమనం చెందుతాడు. జనవరి 2, 2024 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. ఫలితంగా వృషభం, మిథునం, కుంభం రాశుల వారికి అధిక ప్రయోజనాలు కలగనున్నాయి.

సూర్య గోచర్:గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. 16 డిసెంబర్ 2023 సాయంత్రం 4.09 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల నెల రోజుల పాటు ఎటువంటి శుభ కార్యాలు జరగవు.
శుక్ర సంచారరం:25 డిసెంబర్ 2023న ఉదయం 6.55 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి రాశిలో మార్పు కర్కాటకం, సింహం, మకరం, కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు.
అంగారకుడు:గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు డిసెంబర్ 28 ఉదయం 12.36 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు, కుజుడు కలయిక ఏర్పడటం వల్ల మేష, కన్యా రాశి వారికి మేలు జరుగుతుంది.
బుధ గోచార్ :28 డిసెంబర్ 2023 ఉదయం 10.39 నిమిషాలకు బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభం, ధనస్సు రాశి వారికి బుధ సంచారం బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి.
బృహస్పతి :31 డిసెంబర్ 2023 ఉదయం 8.09 గంటలకు మేషరాశిలో ప్రత్యక్షంగా ఉంటుంది. బృహస్పతి ప్రత్యక్ష సంచారం వల్ల మేషం, మిథునం, సింహం రాశుల వారి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి












Click it and Unblock the Notifications