2024లో అదృష్టం మొత్తం ఈ రాశులవారికే
నిర్దేశిత సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. ఈ క్రమంలోనే శనిదేవుడు 2024 సంవత్సరంలో కుంభరాశిలో ఉంటాడు. ఏప్రిల్ 6న శని పూర్వాభాద్రపద నక్షత్రంలోకి సంచరిస్తాడు. దీనివల్ల అనేక రాశులపై శుభప్రదమైన ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశిచక్ర గుర్తులు జాతకుని జీవితంలో మంచి ప్రభావాన్ని తీసుకురానున్నాయి.
మేషరాశి: శని పూర్వాభాద్రలో సంచరించడంవల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త కారు లేదంటే కొత్త వాహనంతోపాటు భూమి లేదంటే ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక పరమైన, మతపరమైన పనుల్లో ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో కూడా పురోగతి ఉంది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తి జీవితంలో మంచి శ్రేయస్సు వస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల ప్రతి రంగంలో సులువుగా విజయం సాధిస్తారు.

వృషభరాశి: అదృష్టం తోడుగా ఉండటంవల్ల ఆర్థిక విషయాల్లో కుదురుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు పొందుతారు. ఇద్దరి మధ్య సంబంధాల్లో ప్రేమ పెరగడంతోపాటు దృఢమైన నమ్మకం కలుగుతుంది. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో కూడా మెరుగుదల ఉంది. ఊహించని రీతిలో ఆదాయ వనరుల నుంచి లాభాన్ని ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
కన్యారాశి: కెరీర్ కు సంబంధించి శుభవార్తను వింటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తారు. ఉద్యోగంతోపాటు వ్యాపారాభివృద్దికి కొత్త అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు.
ధనుస్సురాశి: ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి కొత్త అవకాశాలు రావడంతోపాటు వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తను అందుకుంటారు. అన్నిరకాల ఇబ్బందుల నుంచి సులువుగా గట్టెక్కుతారు.












Click it and Unblock the Notifications