వచ్చే నెల నుంచి వీరికి అన్నీ గోల్డెన్ డేస్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ధేశిత రాశిలో సంచరిస్తుంది. ఈ ప్రభావం భూమితోపాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా ఉంటుంది. జ్యోతిష్యంలో శుక్రుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్టోబరు 2వ తేదీ తెల్లవారుజామున 1.02 గంటలకు శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం నవంబరు నెలలో సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంచరిస్తుంది. దీని ప్రభావంవల్ల ఏయే రాశులవారికి ఎలా కలిసి రాబోతుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి:ఒక రకంగా వీరికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీంతోపాటు ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఈ సమయంలో మంచి కంపెనీల్లో అవకాశాలు తలుపు తడతాయి. డబ్బు సంపాదించేందుకు అదనపు మార్గాలు తోడవుతాయి. డబ్బులను పొదుపు చేయడంవల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢమవుతుంది.

కన్య రాశి:ఈ రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఏ రంగంలో పని తలపెట్టినా విజయవంతమవుతుంది. వీరికి అదృష్టం అనుకూలంగా మారుతుంది. అన్నిరకాల పనుల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. జీవితం సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంవల్ల భవిష్యత్తులో కొత్త కొత్త విజయాలను సాధిస్తారు.
వృశ్చిక రాశి:వీరికి కొత్త ఆదాయ మార్గాలు ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రయాణాలు చేయడంవల్ల కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కెరీర్ లో కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారి ప్రయత్నాలు నెరవేరతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications