సంక్రాంతి వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ప్రతిభ, నాయకత్వం, శక్తి, గౌరవం, సాహసం, విజయం, తండ్రి, ప్రతిష్ట, యజమాని, ఆత్మవిశ్వాసానికి కారకుడు. భానుడు ధనుస్సు రాశిలో ఉంటే ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయరు. డిసెంబరు 16వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధన సంక్రాంతి అంటారు. మూడు రాశులవారికి ఈ ధన సంక్రాంతి వల్ల మంచి ప్రయోజనాలు కలగనున్నాయి.

సింహ రాశి :పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విజయం తథ్యం. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.

these zodiac sign people are very lucky due to Sun Transit 2023

ధనస్సు రాశి :సూర్యుడు ఈ రాశిలోనే ఉంటాడు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల ఉంది. డబ్బు సంపాదించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఊహించనిరీతిలో ధన సంపద ఉంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఎదురుకావు.

మేష రాశి :సంతానం విషయంలో ఆనందం కలుగుతుంది. విదేశీ ప్రయాణం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు ఆసక్తి పెరుగుతుంది. చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. అదృష్టం తోడుంటుంది. ఆదాయం పెరగడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. ఆదాయానికి అదనపు మార్గాలు తెరుచుకుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+