త్రిగ్రాహి యోగంతో ఈ రాశులవారి సంపద అపారంగా పెరుగుతుంది
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో సంచరిస్తూ త్రిగ్రాహి యోగంతోపాటు రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. బుధుడు, భానుడు, చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉన్నప్పటికీ మూడు రాశులవారికి మాత్రం ఆకస్మిక ధనలాభంతోపాటు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి : త్రిగ్రాహి యోగం ఈ రాశివారికి బాగుంటుంది. భౌతికంగా అన్ని ఆనందాలను పొందుతారు. వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. తల్లి పట్ల అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అపారమైన ప్రేమను చూపిస్తారు. ఇదే సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ యోగం సంచార జాతకంలో 10వ ఇంటిపై ఉంది. దీనివల్ల పనిచేసేచోట, వ్యాపారాలవారు విజయం సాధిస్తారు. ఉద్యోగం లేనివారికి కొత్త ఉద్యోగం వస్తుంది.

కన్య రాశి : త్రిగ్రాహి యోగంతో కన్యారాశివారికి మంచిరోజు ప్రారంభమవుతాయి. ఈ రాశి నుంచి ఆదాయ గృహంలో యోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఆదాయం పెరగడంతో కొత్త ఆదాయా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది. పనిచేసే చోట మీ కృషి ఫలితంగా ప్రమోషన్ పొందుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. షేర్ మార్కెట్, బెట్టింగ్, లాటరీ వల్ల లాభం ఉంటుంది.
తులా రాశి : ఈ రాశివారికి వృత్తితోపాటు వ్యాపార పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశితో కర్మల ఆధారంగా ఇది ఏర్పడుతోంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది చాలా మంచి సమయం. పనిచేసేచోట కృషి ఫలితంగా ప్రమోషన్ వస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు.












Click it and Unblock the Notifications