2024లో ఈ రాశులవారికే ఐశ్వర్యం.. మీ రాశి ఉందా?
పురాణాల ప్రకారం, శుక్రుడు లేదా శుక్రాచార్యుడిని రాక్షసుల గురువుగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని లగ్జరీ జీవితానికి, డబ్బుకు, ప్రేమకు, రొమాన్స్ కు కారకుడిగా భావిస్తారు. ఈ నెలాఖరులో శుక్రుడు వృశ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 1:02 గంటలకు అనురాధ నక్షత్రంలోకి వెళతాడు. ఇదే నక్షత్రంలో శుక్రుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు ఉంటాడు. శనిదేవుడు అనురాధ నక్షత్రానికి అధిపతి. శని నక్షత్రంలో శుక్రుడి సంచారం ఏయే రాశులవారికి కలిసి రానుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి : శుక్రుడి రాశి మార్పు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైనవారితో గడిపేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. కష్టాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలోని మధుర్యాన్ని చవిచూస్తారు. కెరీర్ బాగుంటుంది. ఉద్యోగులు, వృత్తిలో ఉన్నవారు, వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. లగ్జరీ వస్తువులను కొనుగోలు చేశారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

వృషభరాశి : అనురాధ నక్షత్రంలో శుక్రుడి సంచారం వృషభరాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా తెస్తుంది. దాంపత్య జీవితంలో గొడవలన్నీ తొలగిపోతాయి. వ్యక్తిత్వాన్ని బాగా మెరుగుపరుచుకుంటారు. వివాహం కుదురుతుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలున్నాయి. ప్రేమ జీవితం విజయవంతమవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
కర్కాటక రాశి : శుక్రుడి నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. కోరికలన్నీ నెరవేరతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదరడంతోపాటు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, అభ్యర్థులు విజయం సాధిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది.












Click it and Unblock the Notifications