ఈ మూడు రాశులకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టుకుంటుంది!
గ్రహాల కదలిక అనేది మానవుల వ్యక్తిగత జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అష్ట గ్రహాల్లో శుక్రుడు కూడా ఒకరు. భూమి దగ్గరగా ఉంటుంది. భూమి, శుక్రుడిని కవల గ్రహాలుగా పరిగణిస్తారు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి పేరును ఈ గ్రహానికి పెట్టారు. లగ్జరీ, రొమాన్స్, ప్రేమ, డబ్బుకు కారకుడు. జ్యోతిష్యంలో దీన్ని శుభగ్రహంగా భావిస్తారు. అక్టోబరు 2వ తేదీన శుక్రుడు తన రాశిని మారుస్తూ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం వల్ల మూడు రాశులవారి జీవితం ఆనందమయం కానుంది. వారికి ఏవిధంగా కలిసివస్తుందో, ఎన్ని ప్రయోజనాలు దక్కనున్నాయో తెలుసుకుందాం.
సింహ రాశి: ఈ రాశివారికి కెరీర్ లో మంచి పురోగతి ఉండటంతోపాటు ఆదాయం రెట్టింపవుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వైవాహిక జీవితం సంతోషాలతో వెల్లివిరుస్తుంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు
వారు పనిచేసే ప్రాంతంలో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి.

వృషభ రాశి: ఈ రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు. వీరికి ఎల్లప్పుడూ శుక్రుడి కటాక్షం ఉంటుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. ఏ పనిని ప్రారంభించినా వీరు విజయవంతం చేస్తారు. అదృష్టం తోడుంటుంది. కోరుకున్న అమ్మాయినే వివాహం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
తులారాశి: ఈ రాశిని కూడా శుక్రుడే పరిపాలిస్తాడు. అదృష్టం తోడుంటుంది. ప్రతి పనిని వీరు సులభంగా చేసేస్తారు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. దీంతో అప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వ్యాపారస్తులకు లాభాలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications