అక్టోబరు నెల రాశిఫలాలు
అక్టోబర్ నెలలో గ్రహాలు రాశి సంచారం చేయడంతోపాటు నక్షత్రాల్లో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. శుభ ఫలితాలనివ్వడంతోపాటు అశుభ ఫలితాలను కూడా ఇస్తాయని చెబుతున్నారు. వీటి ప్రకారం అక్టోబరు నెల ఏయే రాశులవారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
మేష రాశి
కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ నెల ప్రారంభంలో ఎంతో ఓర్పు అవసరం. చర్చలకు, సంభాషణలకు దూరంగా ఉండాలి.. లేదంటే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వ్యాపారాల్లో ఈనెల 17 నుంచి పనులు ప్రారంభమవుతాయి. 18వ తేదీ నుంచి జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 20వ తేదీ నుంచి వ్యాపారాల్లో మార్పులుంటాయి. స్నేహితుల మద్దతు సంపాదిస్తారు.

వృషభ రాశి
ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. లేదంటే అనర్థాలు జరుగుతాయి. 17వ తేదీ నుంచి వ్యాపారాల్లో కొన్ని మార్పుచేర్పులు జరుగుతాయి. అక్టోబరు 27వ తేదీ నుంచి వ్యాపారం పుంజుకుంటుంది.
కర్కాటక రాశి
ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు ఎక్కువవుతాయి. మనసు చంచలమవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. 17వ తేదీ నుంచి పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారికి నిరాశే కలుగుతుంది. పిల్లలు తండ్రి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి. 18వ తేదీ నుంచి తల్లి ఆరోగ్యం బాగవుతుంది.
సింహరాశి
ఆత్మవిశ్వాసం లోపించడంతోపాటు మనసు కలత చెందుతుంది. 17 తర్వాత ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అక్టోబరు 18 నుంచి వ్యాపారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. దీనివల్ల పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.












Click it and Unblock the Notifications