ఈ రాశులవారికి సెప్టెంబరు నెల మొత్తం అదృష్టమే
ఆగస్టు నెలకు చివరి వారం..మరికొద్ది రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు కీలకమైన నెల. పెద్ద పెద్ద గ్రహాలు సంచరిస్తుంటాయి. ప్రధానమైన బృహస్పతి సెప్టెంబరు నాలుగో తేదీన తిరోగమనం చేయనున్నాడు. శుక్రుడు కూడా తన రాశిని మార్చబోతున్నాడు.
అలాగే అదే నెల 16వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రత్యేకంగా సంచరించబోతున్నాడు. సెప్టెంబరు 24న కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితం మారిపోనుంది. కొంతమందికి అదృష్టం రెట్టింపవబోతోంది. ఏయే రాశులవారు ప్రయోజనాలను పొందనున్నారో తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. గతంలో చిక్కుకొనిపోయి వున్న డబ్బులను ఈ కాలంలో తిరిగి పొందుతారు. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం పటిష్ఠమవుతుంది.
సింహ రాశి: ఈ రాశివారికి రాబోతున్న సెప్టెంబరు నెల అదృష్టాన్ని కొని తేబోతోంది. ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులు తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. ఉద్యోగాలు చేసేవారికి వారి కార్యాలయంలో పై అధికారుల నుంచి, యజమానుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.
మిథునరాశి: ఈ రాశివారికి సెప్టెంబరు నెల లాభదాయకంగా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారికి సెప్టెంబరు నెల ఉపశమనం కలిగిస్తుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు శుభవార్తలను వింటారు. పిల్లల నుంచి గుడ్ న్యూస్ అందుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. కుటుంబంతో అధిక సమయం గడపడానికి సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications