కేతువుకు ఇష్టమైన ఈ రాశులవారికి జీవితాంతం సంపదల వెల్లువే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతు గ్రహాలను నీడ గ్రహాలుగా, కీడు గ్రహాలుగా చెప్తారు. అలాంటి చెడు చేసే గ్రహమైన కేతు గ్రహం నిదానంగా సంచారం చేసే గ్రహం. తిరోగమనంలో సంచారం చేస్తూ ఉండే గ్రహం అయిన కేతువు వివిధ రాశులలో సంచారం చేస్తూ కొన్ని రాశులకు శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఇస్తుంటుంది.
కేతు గ్రహానికి ఇష్టమైన రాశులు
జన్మనక్షత్రంలో రాహువు, కేతువులు శుభస్థానంలో ఉంటేనే శుభ ఫలితాలు వస్తాయి . అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా కేతు గ్రహానికి కొన్ని రాశులు అంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కేతు గ్రహానికి ఇష్టమైన ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి కేతువుకు ఇష్టమైన రాశి. మేషరాశి వారికి ఎల్లప్పుడూ కేతువు అనుగ్రహం లభిస్తుంది. కేతువు అనుగ్రహంతో మేష రాశి వారు ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరు ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవాన్ని కలిగి ఉంటారు. కేతువు దయ వల్ల వీరు సమాజంలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వారికి కేతువు అనుగ్రహం ఉంటుంది. వీరు ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. ప్రమోషన్లు కూడా వస్తాయి. కర్కాటక రాశిలో వారు కేతువు దయతో మంచి జీవితాన్ని గడుపుతారు. ఆస్తులు సంపాదిస్తారు. మంచి పెట్టుబడులు పెడతారు. భారీగా లాభాలు గడిస్తారు. సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు. ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి.
కన్యారాశి
కన్యా రాశి వారికి కేతువు అనుగ్రహంతో మంచి ఫలితాలు వస్తాయి. వీరిపైన కేతువు ఎప్పుడు విశేషమైన దయను చూపిస్తాడు. వీరికి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే అవకాశాలున్నాయి. వీరి పట్ల కేతువు చూపించే దయవల్ల జీవితాంతం మీరు సంతోషంగా ఉంటారు. కన్య రాశి జాతకులు కేతువు కారణంగా ధనవంతులు అవుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి పైన ఎల్లప్పుడూ కేతువు దయ ఉంటుంది. వృశ్చిక రాశి వారు జీవితంలో కేతువు కారణంగా సుఖంగా బ్రతుకుతారు. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి కేతువుకి చాలా ఇష్టమైన రాశి కాబట్టి, సొసైటీలో వీరు ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రజాదరణ లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల వీరికి మంచి లాభాలు వస్తాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి కేతువు దయవల్ల కలిసి వస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి కేతువు దయవల్ల జీవితాంతం కలిసి వస్తుంది. మీన రాశి వారు కేతువు కారణంగా ఎప్పుడు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కేతువు అనుగ్రహం వారిని అన్ని రంగాలలో విజయాలు సాధించే దిశగా ప్రోత్సహిస్తుంది. మీన రాశి వారు ఏ పని చేసిన అదృష్టాన్ని పొందుతారు. మీన రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications