జనవరి 21వరకు వీరే కుబేరులు.. రాసి పెట్టుకోమన్న కుజుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. తాజాగా కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడి స్తంభన కొనసాగుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ కుజస్తంభన 2025 సంవత్సరంలో జనవరి 21వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక కర్కాటక రాశిలో కుజస్తంభన కారణంగా పలు రాశుల వారికి ధనయోగం సిద్ధిస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారి జాతకంలో తృతీయ స్థానంలో ప్రస్తుతం కుజుడు స్తంభించిపోయాడు. దీని కారణంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి.

కన్యారాశి
కన్యరాశిలో కుజుడు లాభ స్థానంలో స్తంభించిపోయాడు. దీని కారణంగా కన్యారాశి జాతకులకు అదృష లక్ష్మి వరిస్తుంది. కన్య రాశి జాతకులకు ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కొందరు ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు లాభాలను కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగు పడుతుంది.
తులారాశి
కుజస్తంభన తులా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. తులా రాశిలో కుజుడు లాభ స్థానంలో స్తంభించిపోయాడు. దీని కారణంగా తులా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విదేశాలలో ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇది తులా రాశి వారికి ధన లాభాలు, ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో కుజుడు భాగ్యస్థానంలో స్తంభించిపోయాడు. దీని కారణంగా వృశ్చిక రాశి జాతకులకు సంపన్నయోగం కలుగుతుంది. భూమి వివాదాలు పరిష్కారమై వీరికి అనుకూలమైన ఫలితం వస్తుంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇది వీరికి అదృష్ట సమయం.
కుంభరాశి
కుంభరాశిలో కుజుడు ఆరవ స్థానంలో స్తంభించడం కారణంగా కుంభ రాశి వారికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కుంభరాశి జాతకులు శుభవార్తలు వింటారు. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.
మీనరాశి
మీన రాశి వారికి పంచమ స్థానంలో కుజుడు స్తంభించిపోయాడు. ఈ కారణం వల్ల మీన రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మీనరాశి జాతకులు ఏ పని చేపట్టిన విజయవంతం అవుతుంది. వివాహం కాని వారికి పెళ్లిళ్లు కుదురుతాయి. చాలా కాలంగా పరిష్కారం కాని కుటుంబ, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెండింగ్ పనులు పూర్తయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications