గజకేసరి రాజయోగంతో ఈ రాశులు కుబేరులవుతారు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి అనుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఈనెల నాలుగో తేదీన చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. రేపు గురుడు కూడా ఇదే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. చంద్రుడు, బృహస్పతి కలయికవల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. దీనివల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ధనలాభం కలుగుతోంది. అదృష్టం తోడుండి అన్ని పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆనందం, శాంతి కలుగుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి. దీంతోపాటు ఖర్చులు కూడా తగ్గుతాయి. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులకు తలుపులు తెరుచుకుంటాయి. జీవిత భాగస్వామి సలహాలతో చేసే పనులు బాగా కలిసివస్తాయి.

కన్యా రాశి
ఈ రాశివారికి బంగారు యుగంలాంటిదని చెప్పొచ్చు. నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆస్తి పరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమ జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
తులా రాశి
ఈ రాశివారికి ఊహించని రీతిలో లాభాలున్నాయి. పెద్ద పెద్ద సమస్యలన్నీ సులువుగా పరిష్కారమవుతాయి. కెరీర్ మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులుండటంతోపాటు వారు కోరుకున్నచోటకి బదిలీ అవుతుంది. వేతనాలు పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లో ఉన్న సమస్యలను సులువుగా పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితంలో వేధిస్తున్న సమస్యలన్నీ దూరమవుతాయి.












Click it and Unblock the Notifications