ఉదయించబోతున్న శనిదేవుడు.. ఈ రాశులపై కనక వర్షం

గ్రహాలు సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు అస్తమిస్తాయి. ఇలా అస్తమించే సమయంలో ప్రతి గ్రహం బలహీనంగా మారుతుంది. ఇలా మారినప్పుడు అన్నీ ప్రతికూల ప్రభావాలే ఉంటాయి. కర్మ ఫలదాత అయిన శనిదేవుడు వచ్చేనెల 17వ తేదీ వరకు అస్తమయంలో ఉంటాడు. అదేనెల 18వ తేదీన కుంభరాశిలో ఉదయిస్తాడు. దీనివల్ల ఏయే రాశులవారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయో తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
ఈ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రమోషన్ కూడా అందుకుంటారు. దీనివల్ల బాధ్యతలు పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. శుభవార్తను వింటారు. ఆర్థికంగా పరిస్థితులు కుదుటపడటంవల్ల అప్పటివరకు అనుభవిస్తున్న దరిద్రం తొలగిపోతుంది. వైవాహిక జీవితంలో భాగస్వాములిద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమానురాగాలను కలిగివుంటారు. ఒకరి నుంచి మరొకరికి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది.

these zodiac signs are very lucky due to shani uday in march 2024

వృషభ రాశి
గతం కంటే కెరీర్ చాలా బాగుంటుంది. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో కూడా మంచి పురోగతి ఉంటుంది. ఎప్పటినుంచో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తుల కోరిక నెరవేరుతుంది. ఆదాయంలో మంచి పెరుగుదల ఉంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసుకుంటారు.

తుల రాశి
వ్యాపారస్తులు పెద్ద డీల్ కుదుర్చుకొని ఆర్థికంగా భారీ లాభాలను కళ్లచూస్తారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తారు. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+