శరద్ పూర్ణిమతో మొదలైంది వీరి జీవితంలో అమృతవర్షం, లక్ష్మీ కటాక్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శరత్ పూర్ణిమకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శారద పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. దీపావళి కంటే ముందే శారదీయ పూర్ణిమ నాడు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి శరత్ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన వారికి అప్పటినుండి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు.
శరత్ పూర్ణిమ.. లక్ష్మీ కటాక్షం పొందే రాశులు
ఇక నేడు శరత్ పూర్ణిమ సందర్భంగా చంద్రుడి నుంచి అమృత వర్షం కురుస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ పవిత్రమైన శరత్ పూర్ణిమ రోజునే లక్ష్మీదేవి సాగర మధనం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఇక నేటి నుండి లక్ష్మీదేవి కటాక్షం పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి శారద పూర్ణిమ వేళ విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా వృషభ రాశి వారి జీవితం బాగుంటుంది. వృషభ రాశి వారు ఎప్పటినుంచో కన్న కలలు నెరవేరుతాయి . శారద పూర్ణిమ వేళ లక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెడితే మంచిది.
తులారాశి
తులా రాశి వారికి శారద పౌర్ణమి కలిసి వస్తుంది. నేటి నుండి వీరికి అదృష్టం ఏ పని చేసిన వెన్నంటే ఉంటుంది. ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. డబ్బుకు లోటు ఉండదు. ఈ సమయంలో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇది తులా రాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. తులారాశి జాతకులు పచ్చిపాలను చంద్రుడికి నైవేద్యంగా పెడితే మంచిది.
కుంభరాశి
కుంభరాశి వారికి శారద పౌర్ణమి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు ఇప్పటినుండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో వీరికి శుభ ఘడియలు మొదలవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. డబ్బుకు లోటు ఉండదు. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగా కలిసి వస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి శారద పౌర్ణమి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారు సకల సంతోషాలను పొందుతారు. వీరికి ఈ సమయంలో దేనికి లోటు ఉండదు. శారద పౌర్ణమి వేళ ఈ రాశి వారు గంగాజలాన్ని, తెల్లటి పూలను చంద్రుడికి సమర్పిస్తే అన్ని విధాలా బాగుంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications