ఆగస్ట్ నెలలో కీలక గ్రహాల సంచారంతో నక్కతోక తొక్కబోతున్న రాశులివే.. మీ రాశి ఉందా?

ఆగస్టు నెల అనేక ముఖ్యమైన పండుగలకు నెలవు. ఆగస్టు మాసంలో రక్షాబంధన్, కృష్ణాష్టమి వంటి పండుగలు వస్తాయి. ఈ మాసంలో గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని గ్రహాల స్థానాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి ఇది ఆగస్టు మాసం ఆకస్మిక ధన లాభాలను ఇస్తుంది.

ఆగస్టు నెలలో ఏర్పడే యోగాలు
ఈ గ్రహాల సంచారం వల్ల ఆగస్టు నెలలో విపరీత రాజయోగం, గజ లక్ష్మి రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం వంటి శుభ యోగాలు ఏర్పడతాయి.ఆగస్టు నెలలో గ్రహాల రాశి మార్పుల వల్ల ఏర్పడే రాజ యోగాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తాయి. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.

these zodiac signs get happiness along with wealth in august month due to key planets transit

ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం
శుక్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి, కుజుడు కన్యా రాశిలో సంచరిస్తారు. శని మీన రాశిలో తిరోగమన సంచారం చేస్తాడు, బుధుడు అస్తమిస్తాడు. ఈ గ్రహాల కదలికల వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఇక ఆగస్టులో కలిసివచ్చే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఆగస్టు నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని కొనసాగుతున్నప్పటికీ, శని తిరోగమనంలో ఉండడం వల్ల ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ సమయంలో పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి. పనిలో బిజీగా ఉంటారు, ప్రేమ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.

సింహరాశి
సింహ రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, కెరీర్ పరంగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో సింహ రాశి వారు కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవితంలో సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. ఇది సింహ రాశి వారికి శుభాలను చేకూర్చే సమయం.

తులారాశి
తులా రాశి వారికి ఆగస్టు నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు అనేక విధాలుగా లాభపడతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గి, పొదుపు పెరుగుతుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఏ పని చేసిన సక్సెస్ అవుతారు. తులా రాశి వారి ఇంట సంపదల వర్షం కురుస్తుంది.

మకరరాశి
మకర రాశి వారు ఏలినాటి శని ప్రభావం నుండి కాస్త రిలాక్స్ అవుతారు. ఆగస్టు మాసంలో మకర రాశివారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగస్తులకు విజయాలు చేకూరుతాయి, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+