చతుర్గ్రాహి యోగంతో ఈ రాశులకు కుబేర యోగం
సెప్టెంబరు నెలలో జ్యోతిష్యం ప్రకారం కన్యారాశిలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. వచ్చేనెల 16వ తేదీన సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ శుక్రుడు ఉంటాడు. ఈ రెండు గ్రహాలతోపాటు 2023 నుంచి కేతువు కన్యారాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు సెప్టెంబరు నెలలో కలుస్తుండటంతో అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను నాలుగు రాశులవారు పొందబోతున్నారు. దీనివల్ల జీవితంలో అన్నీ సానుకూల పరిణామాలే ఎదురవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
సింహ రాశి
ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అదనపు ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అందరికన్నా వ్యాపారస్తులకు కలిసివస్తుంది.

మేష రాశి
ఉద్యోగస్తులకు మంచి ఆఫర్ ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివచ్చే అవకాశం కనపడుతోంది. ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా లాభాలుంటాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. జీవితం సుఖాలు, విలాసాలతో గడిచిపోతుంది.
ధనుస్సు రాశి
కలలన్నీ నిజమవుతాయి. కెరీర్ లో మంచి విజయాన్ని నమోదు చేస్తారు. విదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో పనిచేసి విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు బాగుంటుంది. పనిచేస్తున్నచోటే పై అధికారుల నుంచి ప్రశంసలు దొరుకుతాయి.
కన్యా రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడిని అందుకుంటారు. ఆర్థికంగా మెరుగవుతారు. వృత్తికి సంబంధించి శుభవార్తలను వింటారు. కుటుంజ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. కావాలనుకున్నది దొరుకుతుంది. కలలన్నీ నిజం చేసుకుంటారు.












Click it and Unblock the Notifications