అష్టలక్ష్మీ యోగం.. ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కీలకమైన మార్పును తెస్తాయి. వీటిల్లో ప్రధానంగా అష్టలక్ష్మీ అష్టయోగం, గజకేసరి రాజయోగం, త్రిగ్రాహి యోగం మొదలైనవి ఉన్నాయి. వీటివల్ల జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. అష్టలక్ష్మీ అష్టయోగం నాలుగు రాశుల్లో ఏర్పడుతోంది. ఈ రాశులవారు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా బంగారమవుతుంది. అటువంటి గొప్ప యోగం వల్ల జీవితాల మారనున్న రాశుల వివరాలు తెలుసుకుందాం.

వృషభం రాశి
ఈ సమయంలో ఈ రాశివారు ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు, మొండి పనులు ఈ సమయంలోనే పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వైవాహిక బంధంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఎంత శ్రమపడితే అంత ఫలితం దక్కుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

these zodiac signs very lucky due to ashta lakshmi ashta yoga 2024

వృశ్చిక రాశి
ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. రావడం అసంభవం అని వదిలేసుకున్న మొండి బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి. మీచేతికి వస్తాయి. ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఎప్పటినుంచో వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

సింహరాశి
ఈ రాశివారు మహర్జాతకులని చెప్పొచ్చు. పిల్లలు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వాహన యోగం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. భూమి యోగం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు.

కర్కాటక రాశి
కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. డబ్బులు, విలువైన వజ్రాలకు సంబంధించిన వ్యాపారంలో పుష్కలంగా ఆదాయం వస్తుంది. విదేశీ యానానికి అవకాశాలున్నాయి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభిస్తే విజయవంతమవుతారు.

భగవంతుడి అనుగ్రహానికి, మంచి ఫలితాలు పొందడానికి జ్యోతిష్య పండితులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ప్రతిరోజు రావిచెట్టు దగ్గరకు వెళ్లి నల్ల చీమలకు పంచదార వేయాలి. పేదలకు చేయగలిగినంత అన్నదానం, తాగునీటి వసతి కల్పిస్తే యోగం కలుగుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+