బృహస్పతి దీవెనలతో ఐశ్వర్యవంతులవుతున్న రాశులవారు వీరే
జాతకంలో బృహస్పతి అనుకూలంగా ఉంటే జీవితం చివరి వరకు అండగా ఉంటాడు. ఏ గ్రహాలూ అనుకూలంగా లేకపోయినా ఒక్క గురుడే అనుకూలంగా ఉన్నా చాలు.. అన్ని కష్టాల నుంచి గట్టెక్కించడంతోపాటు దోషాలన్నీ తొలగిపోయేలా చూస్తాడు. 2025 మే నెల వరకు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తుంది. దీనివల్ల ప్రధానంగా ఆరు రాశులవారికి అనేక విధాలుగా కలిసిరానుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేషం
ఆర్థిక సమస్యలు తగ్గడంతోపాటు ఆర్థిక ఒత్తిళ్లు కూడా రావు. కొంతకాలం నుంచి వెళ్లాలనుకొని వెళ్లలేకపోతున్న తీర్థయాత్రలతోపాటు విదేశీ ప్రయాణాలు, గృహ ప్రవేశాలు, శుభకార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరతాయి. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ధన ప్రవాహం ఉంది. మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు విజయవంతమవుతారు.

వృషభం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి స్థాయికి చేరుకుంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.
కర్కాటకం
లాభస్థానంలో గురువు ఉంటే శని దోషం మాయమవుతుంది. ఉద్యోగం, వృత్తిలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. పై అధికారుల నుంచి అంతా సానుకూలగా జరుగుతుంది. పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ఇతరులకు సాయం చేసే స్థితికి మీరు చేరుకుంటారు. వైద్య సహాయం సకాలంలో అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కన్య
శని, కుజ, రాహు దోషాలున్నప్పటికీ గురువు వల్ల అవన్నీ కొట్టుకుపోతాయి. సంపద కలిసివస్తుంది. వివాహం విషయంలో, ఉద్యోగ విషయంలో విదేశీ అవకాశాలను అందుకుంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు.
వృశ్చికం
వివాహం పరంగా అన్నీ అనుకూలంగా జరుగుతాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. డబ్బు కలిసివస్తుంది. రుణ సమస్యలు తీరిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.
మకరం
అదృష్టం కలిసివస్తుంది. స్థితిగతులన్నీ మారిపోతాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పిల్లలు మంచి స్థితికి చేరుకుంటారు. వారి నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం వివిధ మార్గాల్లో పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications