ఈ రాశులకు శనిదేవుడి అనుగ్రహం.. ఐశ్వర్యవంతులవుతారు
ఒక జాతకుడు వృద్ధిలోకి రావాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా శని దేవుడి పాత్ర ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే సామాన్యుడు సైతం కుబేరుడు అవుతాడు. ఆయన ఆగ్రహానికి గురైతే అష్టకష్టాలు పడతారు. ఐశ్వర్యానికి, సిరి సంపదలకు కారకుడు శని. సంపద ఇవ్వడమే కాకుండా వాటిని కలకాలం నిలబెట్టే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. 2025 జులై వరకు ఆరు రాశులను శనిదేవుడు అనుగ్రహించాడు. ఏయే రాశులను అనుగ్రహించాడు? వారికి ఏవిధంగా కలిసి రానుంది? తదితర వివరాలను తెలుసుకుందాం.
మేషం
శని లాభస్థానంలో ఉన్నాడు దీనివల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో కూడా ఆదాయం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతమవుతారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. శనిదేవుడు ఇచ్చే ఆదాయం జీవితాంతం కొనసాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం
విదేశీ సొమ్మును అనుభవించే యోగం కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడటానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లభిస్తే అక్కడే ఉండిపోతారు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు రాబడి భారీగా పెరుగుతుంది.
కన్య
శని ఆరో స్థానంలో ఉన్నాడు. ఇది యోగదాయక స్థానం. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారంలో మంచి రాబడి ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పొదుపు చేయాలి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే పెరుగుతుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
తుల
శని పంచమ స్థానంలో సంచరిస్తుండటంవల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. కొత్త ఆదాయ అవకాశాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి శ్రమపడాల్సి ఉంటుంది.
ధనుస్సు
ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. అనుకున్నదానికంటే ఎక్కువగానే జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. లాభదాయక స్నేహాలున్నాయి. ఒప్పందాలు మంచివి కుదురుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు అమరుతాయి.
మకరం
సిరి సంపదలను బాగా వృద్ధి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఖర్చులు తగ్గించి పొదుపు పాటించాలి. ఆస్తులు కొనుగోలు చేయాలి. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు అంచనాలను మించుతాయి.












Click it and Unblock the Notifications