బుధుడి కటాక్షంతో కోటీశ్వరులవుతున్న రాశులు
జ్యోతిష్యంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు నవగ్రహాలు ఉండేవికానీ ప్రస్తుతం ఫ్లూటోను జాబితా నుంచి తొలగించడంతో అష్ట గ్రహాలు మాత్రమే ఉన్నాయి. గ్రహాలకు యువరాజైన బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు. ప్లానెట్స్ ఆఫ్ ప్రిన్స్ అని పిలుస్తుంటారు. బుధుడి కదలికలో ఏ చిన్న మార్పు వచ్చినా అది ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది. వచ్చే నెల 10వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించనుంది. దీనివల్ల ప్రధానంగా మూడు రాశులవారు అదృష్టవంతులు అవుతున్నారు.
కర్కాటక రాశి
వీరికి సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ప్రమోషన్ వస్తుంది. దాంతోపాటు వేతనం పెరుగుతుంది. అదృష్టం కలిసిరావడంవల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ లో పురోగతి ఉంది. వ్యాపారస్తులకు భారీ డీల్స్ కుదురుతాయి. గతంలో చూడని లాభాలను కళ్లచూస్తారు. పేదరికం తొలగిపోయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బును పొదుపు చేసుకోవడంతోపాటు ఖర్చులు పెరగకుండా ఆచితూచి ఖర్చుపెట్టుకోవాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి
సంపదలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. సంతానం కలుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమికుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కష్టసుఖాల్లో ఒకర్నొకరు తోడుగా ఉంటారు. కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో కచ్చితంగా విజయం దక్కుతుంది.
మకర రాశి
వీరికి అన్ని రోజులు కలిసివస్తాయి. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అదృష్టం తోడుంటుంది. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. ఉద్యోగ రీత్యా లేదంటే వ్యాపార రీత్యా ప్రయాణం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటోంది.












Click it and Unblock the Notifications