మాలవ్య మహా పురుష యోగం... కలలో కూడా ఊహించని లాభం
ఈనెల 19న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యం చెబుతున్న ఐదు మహా పురుష యోగాల్లో ఇది కూడా ఒకటి. ఏదైనా రాశికి 1, 4, 7, 10 స్థానాల్లో శుక్రుడు ఉచ్ఛ, స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఏర్పడే ఈ యోగం జులై 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ యోగం పట్టిన వ్యక్తులు ప్రముఖుల స్థాయికి చేరుకుంటారు. రాజకీయంగా వీరి ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుంది. నిత్య కల్యాణం, పచ్చతోరణంలా జీవితం సాగుతుంది. ఏయే రాశులవారు దీనివల్ల లాభపడనున్నారో తెలుసుకుందాం.
మేష రాశి
కలలో కూడా ఊహించని అదృష్టం పడుతుంది. ఆస్తి, ఆదాయం కలిసివస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించి వస్తాయి. ఉద్యోగంలో వైభవం పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యాలుజరుగుతాయి. ఆధ్యాత్మిక పర్యటనలు జరుపుతారు.

వృషభ రాశి
ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తుండటంతో మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఊహించని రీతిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు, ఆదాయం పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు. మనసులోని కోరికలను నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో భాగ్యయోగం ఉంది.
సింహ రాశి
ఊహించని రీతిలో ప్రమోషన్లు వస్తాయి. అన్నివిధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.
కన్య రాశి
విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. విదేశాల్లో స్థిరపడటానికి అవకాశాలున్నాయి. తండ్రివైపు నుంచి ఆస్తి వస్తుంది. ఆధ్యాత్మిక యాత్ర చేపడతారు. ఇంట్లో శుభకార్యం ఉంది. తల్లిదండ్రులతో ఉన్న పొరపొచ్చాలు సమసిపోతాయి. సంపద పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఆర్థికంగా జీవితం సమూలంగా మారిపోతుంది. సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడతారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడతారు. ఇతరులకు సహాయం చేయడంవల్ల మంచి పేరు వస్తుంది.
కుంభ రాశి
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం ఉంది. లాభాలు రావడంవల్ల వృద్ధిలోకి వస్తారు. తల్లి వైపునుంచి ధనలాభం ఉంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది.












Click it and Unblock the Notifications