Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుక్రుడితో 3 రాజయోగాలు.. ఈ రాశులకు అఖండ ధనయోగం

ఈనెల 19న శుక్రుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో గురుడు, సూర్యుడు సంచారం చేస్తుంటారు. సూర్యుడు, గురుడు కలిసి ఆదిత్య యోగం, శుక్రుడు, గురువు కలిసి గజలక్ష్మీ రాజయోగం, శుక్రుడు, సూర్యుడు కలిసి శుక్రాదిత్య రాజయోగం ఏర్పరుస్తారు. ఏకకాలంలో ఇలా మూడు రాజయోగాలు ఏర్పడుతుండటంతో కొన్ని రాశులవారికి అపరిమితమైన ప్రయోజనాలు కలగనున్నాయి. కెరీర్ లో ఎదుగడానికి అనేక అవకాశాలను కల్పిస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి.

మేష రాశి
కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో శాంతి, ఆనందం కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. మాటతీరు, ప్రవర్తనతో అందరినీ ఆకర్షిస్తారు. సమాజంలో అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వరిస్తుంది. వీరికి మంచి ప్యాకేజీ దక్కుతుంది.

these zodiac signs very lucky due to venus transit in taurus in may 2024

వృషభరాశి
వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కెరీర్ లో మీ పనితీరు చాలా బాగుంటుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది.

కన్యా రాశి
ఆర్థికంగా బలపడతారు. సంపద పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలుంటాయి. జీవితంలో సంతోషం, వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది.

ధనుస్సు రాశి
ఈ రాశివారికి అన్నీ శుభ ఫలితాలే. జీవితంలో పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి జీవితంలో చేసే పనులు ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు జరుపుతారు. ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నవారికి లాభాలున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+