సొంతరాశిలోకి శుక్రుడు.. ఈ రాశులపై కనకవర్షం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారంచేస్తుంటాయి. భౌతిక సుఖాలకు, భార్యాభర్తల అనుబంధానికి, లగ్జరీ, కీర్తి, ప్రతిభ, అందం, ఆకర్షణ, శృంగారం, కామం, ఫ్యాషన్ డిజైనింగ్, కళలకు నిలయమైన శుక్రుడు ఈనెల 19వ తేదీన తన సొంత రాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మేష రాశి, మిథున రాశి, సింహరాశివారికి బాగా కలిసివస్తుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
కొంతకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ధైర్యం పెరగడంతోపాటు సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. చేస్తున్న పనిలో విజయం దక్కుతుంది. అదృష్టం తలుపుతడుతుంది. ఉద్యోగ, వ్యాపారల్లో అనుకోకుండా లాభాలు వస్తాయి. చేస్తున్న పనికి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. వారి నుంచి మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందుతాయి.

మిథున రాశి
చేస్తున్న పనిలో గౌరవం అందుకుంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యలుతో ఎక్కువ సమయం గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. కొత్త పని ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. లావాదేవీలకు, విద్యారంగం వారికి కూడా అనుకూలమైన సమయం ఇది.
సింహ రాశి
కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కల నెరవేరుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉండటంతోపాటు డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు ప్రతిష్ట పెరుగుతుంది. పెట్టుబడి నుంచి మంచి లాభాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications