ఈ రాశులకు భోగ భాగ్యాలు.. డబ్బంటే లెక్కేలేదు
ప్రతి మనిషి తన జీవితాన్ని ఆనందంగా గడపడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అవసరమని భావిస్తాడు. అందుకనుగుణంగా కష్టపడి సంపాదిస్తాడు. వాటిని ఖర్చు చేస్తూ విలాసవంతంగా జీవించడానికి ప్రాధాన్యత ఇస్తాడు. మరికొన్ని రాశులవారి దగ్గర దగ్గర డబ్బు బాగా ఉంటుంది. వీరు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటారు. ఎంత ఖర్చు పెడుతుంటారో వీరికే లెక్క ఉండదు. అంత ఖర్చుపెడుతున్నా వీరిదగ్గర డబ్బులు భారీగానే ఉంటాయి. ప్రధానంగా ఐదు రాశులవారికి మాత్రం డబ్బంటే లెక్కే ఉండదు. ఆ రాశులవారు డబ్బును ఎలా ఖర్చుపెడతారో తెలుసుకుందాం.
వృషభ రాశి
డబ్బును భారీగా ఖర్చు చేస్తుండటంవల్ల వీరి దగ్గర డబ్బు నిల్వదు. విలాసవంతంగా జీవించడానికే వీరు ప్రాధాన్యత ఇస్తుండటంతోపాటు భౌతిక సుఖాలు కావాలనుకుంటారు. ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా వెంటనే ఖర్చు పెడతారు.

మిథునరాశి
తమ తెలివితేటలతో ఈ రాశులవారు డబ్బులను సంపాదిస్తారు. ఖర్చు భారీగా ఉండటంతో ఆ స్థాయిలో పొదుపు చేయలేకపోవడంవల్ల భవిష్యత్తులో డబ్బు రాబడి ఉండదు. వీరంతా తాము గొప్పవారిమని చెప్పుకునేందుకే ఉన్న డబ్బును కరిగిస్తుంటారు.
సింహరాశి
ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కావాలనుకోవడంవల్ల డబ్బును విపరీతంగా ఖర్చుపెడతారు. దీనివల్ల సంపద నిలవదు. సూర్యుడి అనుగ్రహం మాత్రం ఉంటుంది. అలాగే వీరు మొదటి నుంచి ఖరీదు ఎక్కువగా ఉన్నవాటిని కొనుగోలు చేసి డబ్బును కూడబెట్టరు.
తులారాశి
తమకన్నా ఇతరులకే వీరు ఎక్కువగా ఖర్చుపెడతారు. దీనివల్ల పొదుపు ఉండదు. అయితే వీరు భూతకాలం, భవిష్యత్తుకన్నా వర్తమాన కాలాన్ని ఎక్కువగా నమ్ముతారు. డబ్బును భారీగా ఖర్చు చేస్తుంటారు.
కుంభరాశి
ఈ రాశివారు కూడా భౌతిక సుఖాలకు, విలాసవంతమైన జీవితానికి డబ్బును ఖర్చు చేస్తుంటారు. ఎదుటివారి దగ్గర తమగురించి గొప్పలు చెప్పుకునేందుకు ఉన్న డబ్బును కరిగిస్తారు. దీనివల్ల పొదుపుకు దూరమవుతారు.












Click it and Unblock the Notifications