భద్ర పురుష రాజయోగంతో తలరాత మారిపోతున్న రాశులు వీరే
గ్రహాల రాకుమారుడు బుధుడు. నవగ్రహాల్లో కీలక గ్రహం. తెలివితేటలు, లెక్కలు, తర్కం, వ్యాపారానికి కారకుడు. బుధుడు కన్యారాశిలోకి సంచారం చేయనుండటంవల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. వచ్చే నెలలో ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ మహాపురుష రాజయోగంవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మీన రాశి
కుటుంబ సభ్యులంతా ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపుతారు. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. డబ్బు రాదు అనుకున్న సమయంలో చేతికి అందుతుంది. కొందరికి విదేశీ యోగం ఉంది. ఉద్యోగస్థులకు, నిరుద్యోగులకు కూడా అవకాశం ఉంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సొంతింటి కల ఈ సమయంలోనే నెరవేరుతుంది.

సింహ రాశి
ఈ రాజయోగంతో వీరు వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకుంటారు. కొత్తగా భూమిని లేదంటే ఇంటిని కొనుగలు చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబంలో గొడవలన్నీ తగ్గిపోతాయి. అందరూ అన్యోన్యంగా ఉంటారు. శాంతి వెల్లివిరుస్తుంది. వీరికి సంపద పెరుగుతుంది. అదనపు ఆదాయం వస్తుంది. అనుకోని రీతిలో సౌకర్యాలు పెరుగుతాయి.
మకర రాశి
ఆర్థికంగా బలపడతారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగవుతారు. కెరీర్ లో మంచి వృద్ధి సాధిస్తారు. వేతనం పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. జీవితంలో కొన్ని శుభవార్తలు వింటారు. అదృష్టం తోడుంటుంది. ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం. రుణాల ఊబి నుంచి బయటపడతారు. సమస్యలన్నీ పరిష్కారమవడంతో మనశ్శాంతిగా జీవిస్తారు.
మిథున రాశి
ఈ రాశివారికి భద్ర మహా పురుష రాజయోగం అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురుకాకుండా విజయవంతంగా పూర్తవుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బుధుడిని పూజించడంవల్ల కోరుకున్న పనులన్నీ పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications