ఏప్రిల్ నెల నుండి ఈ రాశులకు ఏలినాటి శనిదోషం నుండి విముక్తి; ఇక పండుగే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏప్రిల్ మాసం కూడా గ్రహాలు సంచారం చేస్తున్న కారణంగా చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్పబడింది. ఏప్రిల్ నెలలో గ్రహాలు రారాజు సూర్యుడు మీన రాశి నుండి మేష రాశిలోకి సంచరిస్తున్నాడు. గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
శని దోషం నుంచి విముక్తి పొందే రాశులు
ఇక ఇదే సమయంలో ఏప్రిల్ నెలలోనే శని దేవుడు మీనరాశిలో నివాసం ఉండి సూర్యుడు, శుక్రుడు బుధుడు రాహువులతో సంయోగం చెందనున్నాడు. ఇది ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక ఏప్రిల్ మాసంలో కొన్ని రాశులకు శని దోషం నుంచి విముక్తి కూడా లభిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు శనిదేవుని కారణంగా వచ్చే దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏప్రిల్ మాసం నుండి ఈ రాశి జాతకులకు శుభ ఫలితాలు రానున్నాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. కొన్నేళ్లుగా శని దోషాల కారణంగా వీరు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు.
మీన రాశి
శనిదేవుడి సంచారం కారణంగా మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. శనిసంచారం మీనరాశి వారికి ప్రస్తుతం లాభదాయకంగా ఉంటుంది. శనిసంచారం కారణంగా వీరి జాతకంలో ఉన్న ఏలినాటి శనిదోషం తొలగిపోయి అనేకవిధాలుగా ఆదాయం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. ఇక ఉద్యోగప్రయత్నాలు లాభాలను చేకూరుస్తాయి. శనిదోషం నుంచి విముక్తిని పొంది మీనరాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు.
మకర రాశి
శనిదేవుని దోషాల నుండి విముక్తి పొంది మకరరాశి వారు 2025 సంవత్సరంలో ప్రయోజనాలను పొందుతారు. వీరికి ఏలినాటి శని నుంచి ఉపశమనం కలుగుతుంది. మకర రాశి వారికి ఈ సమయంలో భారీగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఏ పని చేసిన సానుకూల ఫలితాలే వస్తాయి. మకర రాశి వారి అదృష్టం మెరుస్తుంది కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఇప్పటినుంచి మకర రాశి జాతకులు సంపదలను చూస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications