బుధుడి సంచారంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
ఈనెల ఐదో తేదీ నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమన దిశలో ఉన్నాడు. 29వ తేదీన కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ రాశిలో బుధుడు ప్రవేశించడంవల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. అంతేకాదు.. మరికొన్ని రాశులవారైతే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 24 రోజుల తర్వాత బుధుడు సంచారం చేయడంవల్ల కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
బుధుడి సంచారం వీరికి వరం లాంటిదని చెప్పొచ్చు. అడుగు పెట్టే ప్రతి రంగంలో విజయం దక్కుతుంది. చేపట్టే ప్రతి పనిలోను అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధిస్తారు. మాట మృదువుగా మారడం కూడా పని పూర్తవడానికి కారణమవుతుంది. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కొత్త పనులు చేపట్టేందుకు ఇది మంచి సమయం.

వృషభ రాశి
వ్యాపారస్తులకు ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోవడంతోపాటు మంచి లాభాలను సంపాదిస్తారు. కెరీర్ లో వృద్ధి చెందడానికి అనేక అవకాశాలు తలుపు తడతాయి. న్యాయపరమైన కేసుల్లో సులువుగా విజయం దక్కుతుంది. అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు కొత్త మార్గాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు దూరమవడంతోపాటు పెద్దల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తారు.
కన్యా రాశి
ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం భారీగా పెరుగుతుంది. జీవితంలో ఎంతో ఉత్సాహవంతంగా ఉంటారు. కెరీర్ పరంగా పెద్ద పెద్ద విజయాలను నమోదు చేస్తారు. బంధువుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఇది కలిసివచ్చే సమయం. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుతారు.












Click it and Unblock the Notifications