నవంబర్ లో శని ప్రత్యక్ష సంచారంతో వీరికి డబ్బుల వర్షం!

వేద జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని దేవుడు కర్మలకు అధిపతి. క్రమశిక్షణను నేర్పే దేవుడు. కష్టపడి పనిచేసే వారి పక్షాన నిలిచే దేవుడు. అటువంటి శని దేవుడు ఎప్పటికప్పుడు తన రాశిని, నక్షత్రాలని మారుస్తూ ఉంటాడు. శని నిదానంగా సంచరించే గ్రహం. అటువంటి శని నవంబర్ 28వ తేదీన తిరోగమన సంచారాన్ని మార్చుకొని మళ్లీ ప్రత్యక్ష సంచారంలోకి మారతాడు.

మీనరాశిలో శని ప్రత్యక్ష సంచారం
ఈ సమయంలో శని ద్వాదశ రాశులవారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తాడు. వచ్చే సంవత్సరం జూన్ 2027 వరకు శని మీనరాశిలోని ఉండి ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. శని తన స్థానాన్ని, తన ప్రవర్తనను మార్చుకున్న ప్రతిసారి కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు వస్తాయి. అయితే మీనరాశిలో ప్రత్యక్ష సంచారం చేస్తున్న శని కారణంగా శుభ ఫలితాలు పొందే రాశులను తెలుసుకుందాం.

These zodiac signs will be showered with money with Saturn direct transit in November

మేషరాశి
మేషరాశి జాతకులకు శని దేవుని ప్రత్యక్ష సంచారం కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఊహించని మార్పులను చూస్తారు. ఇది వీరికి అనేక లాభాలను తీసుకువస్తుంది. ఎప్పటినుండో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం.

కుంభరాశి
కుంభ రాశికి శని అధిపతి. శని ప్రత్యక్ష సంచారం కారణంగా కుంభరాశి జాతకులకు కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ లాభాలు వస్తాయి. ఎక్కడైనా పెట్టుబడి పెడితే దాని నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు.

తులారాశి
తులారాశి వారికి శని ప్రత్యక్ష సంచారం ఊహించని లాభాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు ఈ సమయం కలిసొస్తుంది. పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నింటా లాభాలే వస్తాయి.

మీనరాశి
మీన రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీన రాశి వారు శుభవార్తలు వింటారు. కెరీర్ లో ఊహించని మార్పులు చూస్తారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. శని దేవుని ఆశీస్సులతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+