బుధుడి కదలికలో మార్పు.. ఈ రాశులవారు మహారాజులవుతారు
జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలా గ్రహాలు తమ కదలికలను మారుస్తుంటాయి. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరోరాశికి సంచారం చేస్తుంటాయి. గ్రహాలకు రాకుమారుడులాంటి బుధుడు ఏప్రిల్ రెండోతేదీన మేషరాశిలో తిరోగమనం చేయనున్నాడు. వ్యాపారంలో లాభాలనివ్వడంతోపాటు తెలివితేటలకు కారకుడైన బుధుడు కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు. వాటి వివరాలను తెలుసుకుందాం.
సింహరాశి
బుధుడు సింహరాశివారికి భారీగా ధనాన్ని ఇవ్వబోతున్నాడు. దీనివల్ల రుణబాధల నుంచి విముక్తి చెందుతారు. కెరీర్ లో దూసుకుపోతారు. డబ్బును భారీగా పొదుపు చేస్తారు. అవివాహితులకు వివాహం కుదురుతుంది. వివాహమైనవారికి సంతాన యోగం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

మీన రాశి
బుధుడి కదలికల కారణంగా ఈ రాశివారికి డబ్బు బాగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు భారీగా లాభపడతారు. కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలోనే పూర్తిచేయగలుగుతారు.
మేష రాశి
ఈ రాశివారికి బుధుడు భారీ లాభాలను ఇస్తాడు. కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. రాబడులు విపరీతంగా పెరుగుతాయి. డబ్బును పొదుపు చేస్తారు.
మిథున రాశి
ఈ రాశివారికి బుధుడు మంచి ఆదాయాన్ని సమకూరుస్తాడు. వీరు చేపట్టే ప్రతి ప్రాజెక్టు విజయవంతమవుతుంది. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపారస్తులు గతంలో ఎన్నడూ చూడని లాభాలనిస్తాడు.












Click it and Unblock the Notifications