సెప్టెంబర్ నెలలో ధనవంతులవుతున్న రాశులు వీరే!
నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు సెప్టెంబరు నెలలో మూడు సార్లు సంచారం చేస్తున్నాడు. మూడో తేదీన చిత్త నక్షత్రంలోకి, 23వ తేదీన స్వాతిలోకి, 13వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది చాలా అరుదుగా జరిగే పరిణామం. గ్రహాలు రాశి సంచారం లేదంటే నక్షత్ర సంచారం చేసే సమయంలో కొన్ని రాశులకువారికి మంచి ప్రయోజనాలు కల్పిస్తాయి. అలాగే కుజుడు కూడా కొన్ని రాశులకు విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తున్నాడు.
వృశ్చిక రాశి
కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే వాహనాన్ని కూడా కొంటారు. పనితీరును ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటారు. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. వారికి ఎక్కువగా లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి మార్పులు చోటుచేసుకుంటాయి. కోరుకున్న చోటకు లేదంటే వేరే ప్రాంతానికి బదిలీలుంటాయి. నవ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు కుజుడిని పూజిస్తే ఫలితం కనపడుతుంది.

కుంభ రాశి
డబ్బు ఈ సమయంలో భారీగా వస్తుంది. ఆర్థికంగా జీవితంలో స్థిరపడతారు. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినవారికి భారీగా కలిసివస్తుంది. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గతంలో పెట్టుబడులు పెట్టినవారికి, ఇప్పుడు పెట్టుబడులు పెట్టినవారికి మంచి లాభాలు వస్తాయి. కలిసివస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు.
మేష రాశి
ఆర్థికంగా జీవితం చాలా బాగుంటుంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగవుతారు. జీవితంలో అన్నీ సానుకూల మార్పులే చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో ఈ రాశివారికి అన్నివిధాలుగా కలిసిరావడంతో ఆనందానికి లోటుండదు. నక్షత్ర మార్పుతో వీరికి అనేక లాభాలు కలుగుతున్నాయి. గతంలో ఇక కాదు అనుకున్న ధనం ఈ సమయంలో చేతికి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం పెరిగి సంతోషంగా ఉంటారు.












Click it and Unblock the Notifications