ఈ రాశులవారి కోసం ధనపు సంచులను దొర్లించుకుంటూ తెస్తున్న శుక్రుడు
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు సంపదకు, శుభాలకు కారకుడు. అక్టోబరు నెలలో శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల మూడు రాశులవారికి విపరీతమైన ధనలాభంతోపాటు కోరుకున్న పనులన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ రాశులవారికి శుక్రుడి సంచారం వల్ల బాగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
తుల రాశి
వీరికి అదృష్టం తోడుంటుంది. ఊహించనిరీతిలో ఆర్థికంగా ధనలాభాలు కలిగి జీవితంలో స్థిరత్వం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నచోట ఎదురవుతున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీనివల్ల పనులన్నీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తిచేస్తారు.

కుంభ రాశి
వీరికి ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. దాంపత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం తగ్గుతుంది.
వృశ్చిక రాశి
అదృష్టం తోడుండటంవల్ల పనులన్నీ సులువుగా నెరవేరతాయి. ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. వ్యాపారాలు చేస్తున్నవారికి ఆర్థిక లాభాలున్నాయి. కొంతకాలం నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలు దూరమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications