చతుర్గ్రాహి యోగంతో డిసెంబర్ లో నక్కతోక తొక్కే రాశులివే!

డిసెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తుంది. డిసెంబర్ మాసంలో సంభవించే ఈ ఖగోళ మార్పులు 12 రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపనున్నాయి. డిసెంబర్ 6వ తేదీ శనివారం రాత్రి 8.52నిముషాలకు బుధుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. మరుసటి రోజు డిసెంబర్ 7 మంగళవారం ఉదయం 4 గంటల 26 నిమిషాలకు కుజుడు కూడా ఇదే రాశిలో సంచరిస్తాడు.

డిసెంబర్ లో ముఖ్య గ్రహాల రవాణా
డిసెంబర్ 14న ఉదయం 4 గంటల 26 నిమిషాలకు సూర్యుడు ధనుస్సు రాశిలోకి చేరుతాడు. కుజుడు సూర్యుడు కలయిక వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఆపై ధనుస్సు రాశిలో డిసెంబర్ 20 శనివారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు శుక్రుడు ప్రవేశిస్తాడు. ఆపై డిసెంబరు 29వ తేదీ ఉదయం ఏడు గంటల 27 నిమిషాలకు బుధుడు తిరిగి ఇదే రాశిలోకి వస్తాడు.

these zodiac signs will get good fortune with Chaturgrahi Yoga in december

ధనుస్సు రాశిలో చతుర్గ్రాహి యోగం
ధనుస్సు రాశిలో నాలుగు ముఖ్య గ్రహాల కలయిక కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు నాలుగు గ్రహాలూ కలిసిన చతుర్గ్రాహి యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మేష రాశి జాతకులకు కలిసి వస్తుంది. మేష రాశి వారికి ఈ సమయంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. ధార్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది.

మిధున రాశి
మిధున రాశి వారికి వృత్తి, ఆర్థిక వ్యవహారాలలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. చతుర్గ్రాహి యోగం మిధున రాశి జాతకులకు శుభాలను చేకూరుస్తుంది .ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది.

సింహరాశి
సింహరాశి జాతకులు చతుర్గ్రాహి యోగం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. సంపదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి
చతుర్గ్రాహి యోగం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. సంపదలు పెరుగుతాయి. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మీనరాశి
చతుర్గ్రాహి యోగం మీన రాశి జాతకులకు అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+