నక్షత్రాన్ని మారుస్తున్న శని.. ఈ రాశులవారు కుబేరులే
కర్మ ఫలదాత అయిన శని పేరు చెబితే అందరూ భయపడతారు. అయితే తన మంచి దృష్టిని మానవులపై ప్రసరిస్తుంటారు. ఆయన కటాక్షం ఉంటే కటిక పేదరికంలో ఉన్నవాడు కూడా కుబేరుడవుతాడు. అంతటి శక్తి శనికి ఉంది. జ్యోతిష్యం ప్కారం శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. దీనికి అధిపతి బృహస్పతి. దీనివల్ల మూడు రాశులవారు ప్రయోజనాలు పొందుతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
ఆర్థికంగా ఎటువంటి సమస్యలు తలెత్తవు. జీవితం సాఫీగా సాగిపోతుంటుంది. దంపతులకు సంతాన యోగం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు శుభవార్తను వింటారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. హోలీ తర్వాత రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

సింహరాశి
చిన్న వ్యాపారం నుంచి పెద్దస్థాయి వ్యాపారానికి మారతారు. భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా వేధిస్తున్న కష్టాలు దూరమవుతాయి. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసిరావడంతో పేదరికం నుంచి బయటపడతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు.
మేష రాశి
ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు గతంకంటే మంచి లాభాలను ఆర్జిస్తారు. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. పెట్టే పెట్టుబడులు భారీగా లాభాలను ఆర్జిస్తాయి. ఉద్యోగంలో మంచి గ్రోత్ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది.












Click it and Unblock the Notifications