దసరా వేళ మూడు శుభయోగాలు.. ఈ రాశుల పంట పండినట్టే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో అదేవిధంగా వివిధ పండుగలకు కూడా ఉంటుంది. నేడు విజయదశమి దసరా పండుగ. విజయాలను చేకూర్చే విజయదశమి పండుగ రోజు అనేక సంవత్సరాల తరువాత అరుదైన యాధృచ్చికాలు జరుగుతున్నాయి.
దసరా పండుగ నాడు విశేష యోగాలు.. అదృష్ట రాశులు
నేడు విజయదశమి పండుగ తో పాటు సుకర్మ యోగం, రవి యోగం, ధృతి యోగం కలయిక ఏర్పడుతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం శ్రవణా నక్షత్రం కూడా ఉంటున్నాయి. ఇక దసరా పండుగ నాడు ఏర్పడే విశేష యోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం .

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు దసరా నుండి అదృష్టాన్ని పొందబోతున్నారు. దసరా నాడు ఏర్పడే విశేష యోగాలు వీరికి సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి మంచి జరుగుతుంది.
మిధున రాశి
దసరా నుండి మిధున రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కలిసి వస్తుంది. ఇది అన్ని విధాల మిధున రాశి జాతకులకు మంచి సమయం.
తులారాశి
దసరా నుండి తులా రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయం తులా రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయాలను సాధిస్తారు. నూతన గృహాలను నిర్మించాలనే వీరి కల నెరవేరుతుంది. ఆర్థికంగా తులా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోయి తులారాశి జాతకులు సంతోషంగా ఉంటారు.
సింహరాశి
దసరా నుండి సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. విందులు, విహారయాత్రలకు ఇది మంచి సమయం. సింహ రాశి వారి ఇళ్ళలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇది సింహ రాశి వారికి మంచి ఫలితాలను ఇచ్చే సమయం.
కుంభరాశి
కుంభ రాశి వారికి దసరా అనేక మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కళా రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. కుంభరాశి వారి ఇంటి బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈ సమయం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications