సరిగ్గా పదిరోజుల్లో ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి కుబేరులయ్యే రాశులివేనన్న శుక్రుడు!
శుక్రుడు విలాసాలకు, సంపదలకు అధిపతి. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి శక్తివంతమైన గ్రహంగా స్థానం ఉంది. అటువంటి శుక్రుడు ఆగస్టు మాసంలో జరుపుతున్న సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆగస్టు 21వ తేదీన శుక్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించనున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది.
శుక్ర సంచారం
వృషభ రాశి, తులా రాశికి అధిపతి అయిన శుక్రుడు వ్యక్తి జాతకంలో శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను, అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలోనూ, కన్యారాశిలో నీచ స్థితిలోనూ ఉంటాడు. ఇక అటువంటి శుక్ర సంచారం కారణంగా కలిసి వచ్చే రాశులను తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది . వర్తక వ్యాపారాలు చేసే వారికి ధన లాభం కలుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు విజయాలు సాధిస్తారు. మేష రాశి వారి ఆర్థిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో వీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. మేష రాశి వారికి ఇది శుభ సమయం.
మిధున రాశి
మిధున రాశి వారికి శుక్ర సంచారం లాభాలను ఇస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో అన్ని విధాలా లాభాలను పొందుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పోటీ పరీక్షలు రాసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలు కనిపిస్తాయి.
సింహరాశి
శుక్ర సంచారం సింహ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా సింహ రాశి జాతకులకు ఆగస్టు 21 నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి . వర్తక, వ్యాపారాలు చేసేవారు సానుకూల ఫలితాలను పొందుతారు.వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు.
వృశ్చిక రాశి
శుక్ర సంచారం వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు చూస్తారు. విద్యారంగంలో ఉన్నవారికి గొప్ప విజయాలు సిద్ధిస్తాయి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications