నెలరోజులు ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
బుధుడు, రవి ఏ రాశిలో కలిసినా శుభ ఫలితాలనే ఇస్తారు. బుధుడికి సొంత స్థానమైన మిథున రాశిలో కలవడంవల్ల మరిన్ని శుభ ఫలితాలను అనుగ్రహిస్తాడు. ఈ రాశిలో ఈ రెండు గ్రహాలు కలవడాన్ని బుధాదిత్య రాజయోగంగా పరిగణిస్తారు. జాతకంలో ఈ యోగం ఉన్నప్పుడు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ప్రయత్నం ఏది తలపెట్టినా విజయం వరిస్తుంది. జులై 15 వరకు మంచి ఫలితాలనే ఈ రెండూ ఇవ్వనున్నాయి. దీనివల్ల ఆరు రాశులవారికి అనేక ప్రయోజనాలు ఒనగూరతాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
వృషభం
వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం బాగా వస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

మిథునం
వీరి జీవితం రాజయోగాలతో సాగుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ విషయంలో శుభవార్తను వింటారు.
సింహం
ఈ రాశివారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇతరులకు సాయం చేసే స్థితిలో మీ ఆర్థిక స్థితి ఉంటుంది. అయ్యే పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారాల్లో చురుగ్గా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య
ప్రభుత్వం నుంచి ధనలాభం ఉంది. అలాగే గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి అనుకూల సమయం ఇదే. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. లాభదాయకంగా ఉండే పరిచయాలు కలుగుతాయి.
తుల
విదేశీ ధనలాభం ఉంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు శుభవార్తను అందుకుంటారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. నెలరోజులు వీరు పట్టుకుందల్లా బంగారమే. జీవితాన్ని మలుపు తిప్పే పరిణామాలు చోటుచేసుకుంటాయి. మీకున్న ప్రతిభా పాటవాలన్నీ వెలుగులోకి వస్తాయి.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా మంచి ఫలితమే అందుకుంటారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రమేలో పడతారు. వివాహం నిశ్చయమవుతుంది. భాగస్వామ్యంతో చేసే వ్యవహారాలు కలిసివస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.












Click it and Unblock the Notifications