చంద్ర మంగళ యోగంతో ఈ రాశులవారు చంద్ర మండలానికే
సమస్త విఘ్నాలను తొలగించే విఘ్నరాజుడి నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఈ నవరాత్రుల్లోనే పదోతేదీన అరుదైన చంద్ర మంగళ యోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. వీరు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఈ సమయంలో వారు చేపట్టిన ప్రతి పని ఎంతో విజయవంతంగా ముగుస్తుంది. అదృష్టం తోడుంటుంది.
గ్రహాల సంచారం వల్ల ఏర్పడే యోగాలు వ్యక్తి జీవితంలో అనేక మార్పులకు కారణమవుతాయి. చంద్ర మంగళయోగం, త్రిగ్రాహి యోగం, శక్తి యోగం, గజకేసరి యోగంలాంటివి మనిషికి అనేక శుభాలను కలిగిస్తాయి. కుజుడు, చంద్రుడు కలవడంవల్ల, ఎదురెదురుగా రావడంవల్ల ఈ చంద్ర మంగళయోగం ఏర్పడింది. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

మేషం
చంద్ర మంగళ యోగం వీరికి బాగా కలిసివస్తుంది. లాటరీ తగిలే అవకాశం కనపడుతోంది. స్థిరాస్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఆకస్మికంగా ధనలాభం ఉంది. సంపాదించిన డబ్బును సక్రమ మార్గంలో వినియోగించాలి.
మీన రాశి
ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. పెండింగ్ లేకుండా అన్నీ అయిపోతాయి. చేసే పనుల్లో అదృష్టం కలిసివస్తుంది. న్యాయ సంబంధమైన విషయాల్లో కోర్టుల నుంచి తీర్పులు అనుకూలంగా వస్తాయి.
కర్కాటకం
చిన్ననాటి మిత్రులు కలుస్తారు. దీనివల్ల అన్నీ లాభాలే కలుగుతాయి. గతంలో మొదలై నిలిచిన పనులు పూర్తిచేస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ప్రేమించినవారితోనే పెళ్లి కుదురుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడుపుతారు.
మిథునం
ఇప్పటివరకు ఈ రాశులవారు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి. భార్య తరఫు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. గతం నుంచి సోదరులతో ఉన్న వివాదాలు ఈ సమయంలో చాలా సులువుగా పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలతోపాటు ప్రమోషన్లు కూడా లభిస్తాయి. ఇదే క్రమంలో వారి వేతనం కూడా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications