శక్తివంతమైన త్రిగ్రాహి యోగంతో ఈ రాశులపై డబ్బుల వర్షం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి నిర్దేశిత సమయంలో సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులవారికి అనుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు మాత్రం ప్రతికూల పరిణామాలు ఎదురవుతుంటాయి. కొన్ని కొన్ని యోగాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ తరహాలో ఏర్పాడే యోగాలు మనిషి జీవితంలో గొప్ప గొప్ప మార్పులకు కారణమవుతుంటాయి. వీటివల్ల బండ్లు ఓడలైతే.. ఓడలు బండ్లవుతుంటాయి. ఈనెల 16 నుంచి శుక్రుడు, శని, బుధుడు కలవడంవల్ల సింహరాశిలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం నాలుగు రాశులపై ఉంటుంది. వారికి ఏవిధంగా కలిసివస్తుంది? ఎలా కలిసివస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
వృషభరాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలో పూర్తిచేయగలుగుతారు. ఏ పని తలపెట్టినా శీఘ్రంగా జరిగిపోతుంది. అందుకు అదృష్టం తోడుంటుంది. రాదనుకొని వదిలేసిన డబ్బులు కూడా వస్తాయి. న్యాయపరమైన విషయాల్లో న్యాయస్థానాల్లో విజయం వరిస్తుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

సింహరాశి
ఈ రాశివారికి త్రిగ్రాహి యోగంవల్ల విదేశీ యానం ఉంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు దూరమవుతాయి. పిల్లల అనారోగ్యం కలవరపెడుతుంది. కాకపోతే అవన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి. స్నేహితులతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసివస్తున్నప్పటికీ వారు ఎంత కష్టపడితే అంతే ఫలితం దక్కుతుంది. ఎంత ఎక్కువగా శ్రమపడితే అంత మంచిది.
తులా రాశి
సాడేసతి ప్రభావం తగ్గుతుంది. ఆకస్మికంగా ధనలాభం ఉంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఈ క్రమంలో అదృష్టం మీకు అండగా నిలబడుతుంది. స్నేహితులతో కలిసి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వైవాహిక జీవితంలో ఉన్నవారికి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
మీనరాశి
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు ప్రేమ విషయంలో విజయవంతమవుతారు. పెద్దలను ఒప్పిస్తారు. విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. త్రిగ్రాహి యోగం మీనరాశివారికి అన్నివిధాలుగా కలిసిరావడమేకాదు.. అన్ని రంగాల్లో ఉన్నవారికి లాభాలను తెచ్చిపెడుతుంది.












Click it and Unblock the Notifications