ఈ రాశులపై సిరిసంపదల వర్షం కురిపిస్తున్న చంద్రుడు

ఈనెల 23వ తేదీ నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు చంద్రుడు సింహం, కర్కాటకం, మిథునం, వృషభ రాశుల్లో సంచారం చేస్తాడు. దీనివల్ల శుభఫలితాలు కలుగుతాయి. సాధారణంగా చంద్రుడు రాశి సంచారం చేస్తున్నాడంటే అన్నీ శుభ ఫలితాలే ఉంటాయి. మనసులో ఉన్న కోరికలను నెరవేరేలా చేస్తాడు. లక్ష్మీ కటాక్షంతోపాటు మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంత జీవితాన్ని ప్రసాదిస్తాడు. మానసిక ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు. ప్రస్తుతం చంద్రుడి సంచారం వల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

కర్కాటకం
ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉన్నవారి కుటుంబంతో వివాహం కుదురుతుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగులకు బాగుంటుంది. కోరికలన్నీ నెరవేర్చుకుంటారు.

these zodiac signs will get rich and luxury life due to chandra gochar 2024 september

తుల
వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు అంచనాలకు మించి రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తల్లివైపు నుంచి ధనలాభం ఉంటుంది. ఉద్యోగులతోపాటు నిరుద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు తలుపుతడతాయి. వేధిస్తున్న వ్యాధుల నుంచి బయటపడతారు.

వృశ్చికం
ఆకస్మిక ధనలాభం ఉంది. మనసులో కోరికలు నెరవేరడంతోపాటు విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. బంధువుల్లో బాగా ఉన్నవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి.

మేషం
ఆదాయం పెరుగుతుంది. మనసులో కోరికలన్నీ నెరవేరతాయి. విలువైన ఆస్తి కలిసివస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో కొత్త కొత్త సౌకర్యాలను సమకూర్చుకుంటారు.

వృషభం
వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం అందుకుంటారు. కొద్దిపాటి శ్రమతోనే ఆదాయం బాగా అభివృద్ధి చెంది ఆశించినస్థాయికి చేరుకుంటారు. సోదరులతో ఉన్న ఆస్తి వివాదం ఈ సమయంలోనే పరిష్కారమవుతుంది. దూర ప్రయాణం చేస్తారు. దీనివల్ల మంచి లాభం కలుగుతుంది.

మకరం
సంపద పెరుగుతుంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. బాగా ఉన్నవారి కుటుంబంలోనివారితో ప్రేమలో పడతారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+