మీనరాశిలోకి సూర్యుడు.. ఈ రాశులకు అద్భుత ధనయోగం
గ్రహాలకు రాజైన సూర్యుడు జ్యోతిష్యం ప్రకారం గౌరవం, ప్రతిష్ట, ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ ఉద్యోగం వంటి అంశాలను ప్రభావితం చేస్తాడు. ఆయన రాశి సంచారాన్ని సంక్రాంతి అంటారు. ఈనెల 14నే సూర్యుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల మూడు రాశులవారి జీవితాలు బాగా ప్రభావితమవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మిథునరాశి
సూర్యారాధనవల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. అలాగే అన్ని విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబంలో శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఇంటికి అతిథులు వస్తారు. ఆనందం లభిస్తుంది. వివిధ రంగాల్లో విజయవంతంగా కొనసాగుతున్నవారి పరిచయాలు ఏర్పడటంవల్ల మీలో మార్పు రావడంతోపాటు జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు.

కర్కాటకరాశి
సూర్యుడి ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో విజయం ఉంది. వ్యాపార భాగస్వామితో కలిసి ప్రత్యేక ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అన్ని పనుల్లో అదృష్టం తోడుండటంవల్ల ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టుల లభిస్తాయి. దీనివల్ల ప్రయాణాలు చేయడంతోపాటు వీటిని విజయవంతంగా పూర్తిచేస్తారు.
కన్యారాశి
ఈ రాశికి అధిపతి బుధుడు. ఇతనికి సూర్యుడితో మంచి స్నేహ సంబంధాలుంటాయి. అదృష్టాన్ని మార్చే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారంలో లాభం ఉంది. పనిచేసేచోట గౌరవం లభిస్తుంది. కొత్త ఉద్యోగానికి అవకాశం ఉంది. సహచర ఉద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. బెస్ట్ డెస్టినేషన్ ట్రిప్ కు వెళ్లే అవకాశం కనపడుతోంది. చేపట్టే ప్రయాణం కూడా సానుకూలంగా సాగుతుంది.












Click it and Unblock the Notifications