జనవరి 12నుండి ఈ రాశులవారు మహర్జాతకులు.. తేల్చేసిన కుజ, రాహువులు!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు వివిధ రాశులలోకి మాత్రమే కాకుండా వివిధ నక్షత్రాలలోకి కూడా సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాల నక్షత్ర సంచారం కూడా రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి, ఒక నక్షత్రంలో నుంచి మరొక నక్షత్రంలోకి నిర్దిష్ట సమయంలోనే సంచారం చేస్తాయి.
రాహువు, కుజుడు నక్షత్ర సంచారం
ఇక జనవరి 12వ తేదీన కుజుడు పునర్వసు నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. త్వరలో మార్చి 16వ తేదీన రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ రెండు గ్రహాలు సంచారం కారణంగా కొన్ని రాశుల వారి విశేషమైన ఫలితాలను పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి కుజుడు మరియు రాహువు నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారి అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసిన విజయం వరిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది లాభాలను ఇస్తుంది. విద్యార్థులకు కూడా ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది .
మేషరాశి
మేషరాశి వారికి కుజుడు మరియు రాహువు యొక్క నక్షత్ర సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. వీరికి డబల్ అదృష్టం వస్తుంది. ఏ పని చేసిన విజయలక్ష్మి వెన్నంటే ఉంటుంది. మేషరాశి వారికి రాహువు, కుజుడు కారణంగా సంపద పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇది అన్ని విధాలుగా మేషరాశి వారికి శుభాలను చేస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు మరియు రాహువు యొక్క నక్షత్ర సంచారం వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి కి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications