రెండురోజుల్లో శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారి సుడి తిరగబోతోంది!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ నిర్దిష్ట సమయం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. ఇక నవగ్రహాలలో అత్యంత వేగంగా కదిలే గ్రహంగా చెప్పుకునే చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని యోగాలను ఏర్పరుస్తారు. జనవరి 9వ తేదీన చంద్రుడు గురువుతో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
గజకేసరి రాజయోగం
ఈ గజకేసరి రాజయోగం కారణంగా జనవరి 9వ తేదీ నుంచి కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు.ఈ యోగం వీరికి విశేషమైన సంపదలను, సంవృద్ధిని ఇస్తుంది. మరి గజకేసరి రాజయోగం కారణంగా ఈ జనవరి మాసంలో లబ్ధిని పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభరాశి వారికి ఆ రాశి యొక్క మొదటి గృహంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వృషభరాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయం ఉద్యోగస్తులకు, వ్యాపారాలు చేసేవారికి మంచి సమయం. గజకేసరి రాజయోగం ఫలితంగా ఊహించని ఆర్థికలాభాలు కలుగుతాయి. వృషభరాశి జాతకులు సంతోషంగా ఉంటారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఆరవ స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ధనుస్సు రాశికి చెందిన వారు గజకేసరి రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. వారికి వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుండి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారులు తమ ప్రాజెక్టుల నుంచి మంచి ఫలితాలను పొందుతారు. ఇది ధనస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చే సమయం. ఈ సమయంలో ఆర్థికంగాను, ఆరోగ్యపరంగానూ వీరికి బాగుంటుంది.
కుంభరాశి
కుంభరాశిలో నాలుగవ గృహంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కుంభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుంభ రాశి వారికి ఈ సమయంలో భారీగా అదృష్టం పడుతుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం పెరుగుతుంది. కుంభ రాశి వారి కుటుంబం సంతోషకరంగా జీవిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications